ఏవీతో హీటెక్కించి, హౌస్‌లోకి ఎంటర్ అవ్వగానే జైలులో అడుగు పెట్టి, బయటికి వచ్చిన నాలుగు రోజుల్లోనూ తన పర్‌ఫామెన్స్‌తో జోరెత్తించిన కంటెస్టెంట్ సంజన, ఫస్ట్ వీక్‌లోనే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది.
హౌస్ నుండి బయటికి వచ్చాక అమ్మడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు, హౌస్ మేట్స్ పైనా, బిగ్‌బాస్ టీమ్ పైనా, చివరికి బిగ్‌బాస్ హోస్ట్ నానిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, మీడియా దృష్టినీ, ఆడియన్స్ దృష్టినీ ఆకర్షించింది సంజన. ఇదంతా అటుంచితే, ఇప్పుడీ కాంట్రవర్సీ భామను మళ్లీ హౌస్‌లోకి పంపించేందుకు తెర వెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయనీ తాజా సమాచారమ్.
వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా ఒకసారి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్‌కి మరోసారి హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది 'బిగ్‌బాస్' గేమ్ రూల్స్ ప్రకారం. అలా ఫస్ట్ వీక్‌లోనే బిగ్ హౌస్ నుండి బయటికి వచ్చిన సంజన తిరిగి హౌస్ లోపలికి వెళ్లనుందనీ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే, సంజన రీ ఎంట్రీతో హౌస్‌లో వాతావరణం మరింత హీటెక్కే అవకాశాలు లేకపోలేదు. ఆల్రెడీ హౌస్‌లో కాంట్రవర్సీలు స్టార్ట్ అయ్యాయి.
తనీష్, నూతన్ నాయుడు మధ్య నువ్వెంత అంటే నేనెంత అనే స్థాయిలో వివాదాలు చెలరేగాయి. ఇప్పుడు సంజన ఎంటర్ అయితే ఆ వేడికి మరింత ఆధ్యం పోసినట్లే అవుతుంది. మరోవైపు బిగ్‌బాస్ ద్వారా సంపాదించిన పాపులారిటీతో సంజనకు సినిమా అవకాశాలు పోటెత్తుతున్నాయట.