బ్రహ్మోత్సవం తరవాత శ్రీకాంత్ అడ్డాల బాగా ఖాళీ అయిపోయాడు. ఎలాగోలా గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో అడుఉగపెట్టి, ఓ కథ ఓకే చేయించుకున్నాడు. అయితే హీరోనే దొరకడం లేదు. శ్రీకాంత్ కథ చాలా మంది హీరోల చుట్టూ తిరిగింది. కొంతకాలం శర్వానంద్‌తో ఈసినిమా ఉంటుందన్నారు. కానీ శర్వా కూడా సైడైపోయినట్టు టాక్. ఇప్పుడు తాజాగా నాగచైతన్య లైన్‌లోకి వచ్చినట్టు సమాచారం. గీతా ఆర్ట్స్‌లో ఇప్పటికే చైతూ ఓ సినిమా చేశాడు. చైతూతో మరో సినిమా చేయడానికి గీతా ఆర్ట్స్ కూడా సుముఖంగా ఉంది. చైతన్యకి ఈ కథ నచ్చితే - పట్టాలెక్కించాలని గీతా ఆర్ట్స్ ఆలోచన. ఈమధ్యన చైతూ - శ్రీకాంత్ అడ్డాల మధ్య చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది.
అయితే.. కథ నచ్చినా ఇప్పటికిప్పుడు డేట్లు ఇవ్వడానికి చైతూ కూడా రెడీగా లేడు. ఎందుకంటే... వెంకీ మామా పూర్తవ్వాలి. ఆ తరవాత శేఖర్ కమ్ముల సినిమా అవ్వాలి. అప్పటి వరకూ శ్రీకాంత్ అడ్డాల ఎదురుచూడగలడా? అనేదే డౌటు. ఎందుకంటే శ్రీకాంత్‌కి ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది. మరింత గ్యాప్ తీసుకోవడం శ్రీకాంత్ అడ్డాలకీ ఇష్టం లేదు. మరో హీరో దొరక్కపోతే గనుక.. చైతూ కోసం ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేదు.