'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు పరశురాం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో, స్టార్ హీరోలపై దృష్టి పెట్టాడీ దర్శకుడు. ఆ క్రమంలోనే మహేష్ బాబు కోసం ఓ స్టోరీ సిద్ధం చేసుకున్నాడు. కానీ, మహేష్ పరశురామ్‌ని హోల్డ్‌ల్ పెట్టడంతో, అదే స్టోరీని అఖిల్‌కి చెప్పి ఓకే చేసుకున్నాడు. అయినా మనోడి దృష్టి స్టార్స్ పై నుండి మళ్లడం లేదట. ఎలాగైనా ఈ సారి చేయబోయే సినిమా స్టార్ హీరోతోనే ఉండాలని పంతం పట్టి కూర్చొన్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో మరోసారి డార్లింగ్ ప్రబాస్‌పై కన్నేశాడు. ప్రబాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ స్టార్.
'బాహుబలి' తర్వాత ఆయన చేసే సినిమాలన్నీ, అదే రేంజ్‌లో ఉంటున్నాయి. అదే అంచనాలతో రూపొందిన 'సాహో' నిరాశపరిచినా ప్రబాస్‌ని ప్యాన్ ఇండియన్ స్టార్ రేంజ్‌లోనే చూస్తున్నారు మన దర్శక, నిర్మాతలు. సో ప్రబాస్‌ని మెప్పిస్తే, తాను అనుకున్న రేంజ్‌ని అందుకోవడం ఖాయమని భావించిన పరశురామ్, ప్రబాస్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రిపేర్ చేశాడనీ, ఆల్రెడీ స్టోరీ లైన్ ప్రబాస్‌కి వినిపించాడనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, స్క్రిప్టుపై ప్రబాస్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారనీ, కానీ, డెవలప్ చేస్తే, ఖచ్చితంగా కలిసి పని చేద్దామని మాటిచ్చాడనీ తెలుస్తోంది. మరి, ప్రబాస్‌ని మెప్పించేలా స్క్రిప్టులో మార్పులు చేసి, ఇప్పటికైనా మన హిట్ డైరెక్టర్ పరశురామ్ సందిగ్ధం వీడతాడా.? చూడాలిక.