సర్కారు వారి పాట తరవాత పరశురామ్ నాగచైతన్యతో ఓ సినిమా చేయాలి. `నాగేశ్వరరావు` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. `సర్కారు వారి పాట`కు ముందే కథ ఫైనల్ అయిపోయింది. కానీ.. ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌డేటూ లేదు. చైతూ వెంకట్ ప్రభు కథకి ఓకే చెప్పడంతో పరశురామ్ వెయిటింగ్‌లో పడిపోయాడు. ఇప్పుడు అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా, లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది. దానికి కారణం... కథే. పరశురామ్ రాసిన కథలో హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్లు `గీత గోవిందం`లా అనిపిస్తున్నాయన్నది చైతూ కంప్లైంట్. పైగా... మరీ క్లాసీగా ఉండే కథలు వద్దని, కాస్త మాస్ టచ్ ఉండాలని పరశురామ్‌కి సలహా ఇచ్చాడట చైతూ. దాంతో ఇప్పుడు `నాగేశ్వరరావు` కథని పూర్తిగా పక్కన పెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఆ స్థానంలో కొత్త కథని తయారు చేసి, చైతూకి వినిపించాలని చూస్తున్నాడు పరశురామ్. వెంకట్ ప్రభు సినిమా అవ్వడానికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. ఈలోగా కథ ని రెడీ చేసుకోవొచ్చు. కాకపోతే... ఇప్పటికే చైతూ కోసం పరశురామ్ చాలా వెయిట్ చేశాడు. ఇంకొంత కాలం ఆ ఎదురు చూపులు కొనసాగించాల్సి ఉంటుంది.