మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్‌హిట్ అందుకొన్న ‘లూసిఫర్’కు రీమేక్‌గా ఇది రానుంది. మోహన్‌రాజా దర్శకుడు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్రబృందం భారీగానే సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పవన్‌కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు నిర్ణయించుకుందట. పవన్ కూడా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.
మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్‌కల్యాణ్ ఒకే స్టేజ్‌పై సందడి చేస్తే ఆ హంగామానే వేరు. ఇప్పుడు ఆ హంగామా ఇప్పుడు మరోసారి మెగా ఫ్యాన్స్ కి దక్కుతుంది. అన్నట్టు ఈ గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి ఆయన కూడా వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇదే జరిగితే సందడి మెగా లెవల్ లో వుంటుంది.