పూరి చైతన్యకి సాలిడ్ హిట్ ఇస్తాడా?

మరిన్ని వార్తలు

అక్కినేని మూడో తరం నటుడు నాగ చైతన్య ఇప్పుడిప్పుడే కెరియర్ లో సక్సెస్ అందుకుంటున్నాడు. తోలి నాళ్లలో చైతు ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే కష్ఠానికి తగ్గ ఫలితం అందుతోంది. గత ఏడాది 'దూత' వెబ్ సిరీస్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. లాల్ సింగ్ చడ్డా లాంటి ఘోర పరాజయం తరవాత దూత తో అన్నీ భాషల్లో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం చందు మొండేటి తెరకెక్కిస్తున్న 'తండేల్' అనే ప్రయోగాత్మక చిత్రం లో నటిస్తున్నాడు. ఇప్పటివరకు చైతు కనిపించని గెటప్ తో ఈ మూవీలో కనిపిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పై చైతూకి  భారీ అంచనాలే ఉన్నాయి. అందుకోసం బాగా కష్టపడుతున్నాడు.  


తండేల్ తరవాత ఇంకా ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు చైతు. దూత సెకండ్ సీజన్ ఉంటుందని  తెలుస్తోంది. కానీ దీని పై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ టైమ్ లో చైతు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గూర్చి టాలీవుడ్ లో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. పూరి జగన్నాథ్ తో చైతు ఒక ప్రాజెక్ట్ కి కమిట్ అయినట్టు తెలుస్తోంది. 'లైగర్' మూవీ డిజాస్టర్ కావటంతో పూరికి ఎవరు పెద్దగా  ఛాన్స్ ఇవ్వటం లేదు. ఇలాంటి టైంలో చైతు ఎందుకు పూరిని నమ్ముకుంటున్నాడు అని విమర్శలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం పూరి రామ్ పోతినేనితో డబల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ తరవాత నాగ చైతన్యతో వర్క్ చేస్తాడని సమాచారం. నాగార్జున కి శివమణి లాంటి హిట్ ఇచ్చిన పూరి చైతూకి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. పూరి సినిమాల్లో హీరో క్యారక్టరైజేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. డిఫరెంట్ మ్యానరిజం చూపించటానికి ఇష్ట పడతాడు. పోకిరిలో మహేష్, బుజ్జి గాడు లో ప్రభాస్, ఇస్మార్ట్ శంకర్ లో రామ్ లను ఇలాగే వైరిటీగా చూపించి వారిలో కొత్త కోణాన్ని ఎలివేట్ చేసాడు పూరి. ఇప్పుడు చైతుని కూడా ఇలా వైరైటీగా చూపించి చైతూలో టాలెంట్ బయట పెడతాడేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS