రికార్డ్ స్థాయిలో 'ఓజీ' డిజిటల్ డీల్

మరిన్ని వార్తలు

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగుస్తున్న క్రమంలో తాను కమిట్ అయిన సినిమాలు  పూర్తి  చేస్తారని టాక్. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీర మల్లు, సుజిత్ తో చేస్తున్న OG, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు దాదాపు సగానికి పైగా పూర్తి కావచ్చాయి. మిగతా పార్ట్ కంప్లీట్ చేసి వరసగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అండ్ టీమ్. ఈ నేపథ్యంలోనే OG  సినిమా గూర్చి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్  చేస్తోంది.                 


పవన్ కళ్యాణ్  సినిమా అంటే హిట్ ప్లాఫ్ తో సంబంధం లేకుండా వసూళ్ళు సాధిస్తాయి. పవన్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అయ్యింది. సెట్స్ పై ఒకే సారి మూడు సినిమాలు ఉన్నా అన్నీ పెండింగ్ లో ఉండిపోయాయి. గత ఏడాది 'బ్రో' మూవీతో వచ్చినా అది సాయి తేజ్ ఖాతాలో చేరింది.  అది పవన్ ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా కాదు. అందువల్ల పవన్ ఫాన్స్ మంచి ఆకలితో వెయిట్ చేస్తున్నారు.  తమ అభిమాన హీరో సినిమా థియేటర్స్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని. తప్పకుండా వారి అంచనాలు అందుకునేలా OG సినిమా ఉంటుందని సుజిత్ భరోసా ఇచ్చాడు. దానికి తగినట్టుగానే 'ఓజీ' డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడు అయినట్టు తెలుస్తోంది. 


తాజా సమాచారం ప్రకారం 'ఓజీ' సినిమా డిజిటల్ రైట్స్ 65 కోట్లకి సేల్ అయినట్టు తెలుస్తోంది. కేవలం డిజిటల్ రైట్స్ ఇంత పెద్ద మొత్తానికి లాక్ అయితే, ఇక థియేటర్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అని రిలీజ్ కి ముందే వసూళ్ల వేట సాగిస్తుందేమో చూడాలి. OG మూవీ అనుకున్న దానికంటే సూపర్ హిట్ అయితే పవన్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటడం గ్యారంటీ. ఇప్పటికే దేశం నలుమూలల పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ కి పాన్ ఇండియా హీరో ట్యాగ్ కూడా యాడ్ అయితే ఆ కిక్కే వేరు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS