చైతూ రూటు మార్చాడా?

మరిన్ని వార్తలు

నాగచైతన్య తాజా చిత్రం కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో చైతూ తొలిసారిగా ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో జత కడుతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో చైతూ చాలా డిఫరెంట్‌గా కనిపించబోతున్నాడట. పూర్తిగా ఎంటర్‌టైనింగ్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడట చైతూ ఈ సినిమాలో. ఇంతవరకూ ఇలాంటి క్యారెక్టర్‌లో చైతూ నటించలేదు. గతంలో '100 పర్సెంట్‌ లవ్‌' సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనరే అయినా కానీ, అంతకు మించిన ఎంటర్‌టైనింగ్‌ పాత్రలో కనిపిస్తాడట ఈ సినిమలో నాగచైతన్య. ఈ సినిమా కోసం చైతూ కంప్లీట్‌ మేకోవర్‌ అయ్యాడట. అసలే.. చైతూ 'సాహసం శ్వాసగా సాగిపో', ప్రేమమ్‌' చిత్రాలతో సక్సెస్‌ మీదున్నాడు. అదే సక్సెస్‌ జోరు ఈ సినిమాతోనూ కొనసాగించాలనుకుంటున్నాడట. నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి మంచి సినిమాను తెరకెక్కించి, సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ. ఈ సినిమాతో మరో సూపర్‌ హిట్‌కి రెడీ అవుతున్నాడు. చైతూని ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించనున్నాడట. సమ్మర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క చైతూ కృష్ణ మరిముత్తు డైరెక్షన్‌లో ఇంకో సినిమాకి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఈ సినిమాలో చైతూ పక్కన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS