నాగచైతన్య కథానాయకుడిగా మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. చందూ మొండేటి దర్శకుడు. ఈ చిత్రానికి సవ్యసాచి అనే టైటిల్ ఖరారు చేశారు. రెండు చేతులతోనూ బాణాల్ని సంధించేవాడు అని అర్థం. రెండు చేతుల్లోనూ ఆయుధాలున్న చైతూ లుక్‌తో పాటు లోగోని విడుదల చేసింది చిత్రబృందం. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన యుద్దం శరణం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈలోగా ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. కార్తికేయ, ప్రేమమ్ సినిమాలతో వరుస విజయాలు సాధించాడు చందూ. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడమో చూడాలి.