ఫాన్స్ ని కొన్ని రోజులు ఆగమంటున్న చై - శామ్..!

మరిన్ని వార్తలు

'ఏమాయ చేశావె' చిత్రంతో తెరంగేట్రం చేసిన సమంత, తర్వాత చైతూతో 'ఆటో నగర్‌ సూర్య', 'మనం' తదితర చిత్రాల్లో నటించారు. ఆ పై వీరిద్దరూ ప్రేమలో పడడం, పెద్దల ఆంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవడం ఇదంతా జరిగిపోయింది. అయితే పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారనీ, అదీ ఓ లవ్‌స్టోరీ అని ఈ మధ్య గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. నిజానికి సమంతతో కలిసి పెళ్లి తర్వాత స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలన్నది చైతూ కోరిక కూడా. అయితే ఈ విషయంపై చైతూ క్లారిటీ ఇచ్చేశాడు. 

సమంతతో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే. కానీ అందుకు తగ్గ కథ ఇంకా దొరకలేదు. సో ఇప్పుడప్పుడే సమంతతో సినిమా లేదు అని వివరణ ఇచ్చాడు. వస్తున్న వార్తలన్నీ ఉత్తవేననీ చైతూ తేల్చేశాడు. ప్రస్తుతం నాగచైతన్య 'సవ్యశాచి' సినిమాలో నటిస్తున్నాడు. 'ప్రేమమ్‌' సినిమాతో హిట్‌ ఇచ్చిన చందూ మొండేటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ ఓ డిఫరెంట్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నాడు. కొత్త భామ నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో చైతూతో జోడీ కడుతోంది. ఈ సినిమాలో భూమిక కీలక పాత్ర పోషిస్తుండగా, తమిళ హీరో మాధవన్‌ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరో పక్క చైతూ 'శైలజారెడ్డి అల్లుడు' అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ ఏకకాలంలో షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలో చైతూ సరసన అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సమంత విషయానికి వస్తే బిగ్‌ ప్రాజెక్ట్స్‌ అయిన 'రంగస్థలం', మహానటి చిత్రాలు సమంత చేతిలో ఉన్నాయి. వీటిలో 'రంగస్థలం' మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS