ప్రేమించి పెళ్లి చేసుకున్న అందమైన జంట నాగచైతన్య - సమంత. 'ఏ మాయ చేశావె' వంటి లవ్‌స్టోరీతో తొలిసారి ఆన్ స్క్రీన్ జత కట్టిన ఈ జంట ఆఫ్ స్క్రీన్‌లోనూ అదే లవ్‌ని కొనసాగించి, పెద్దల అంగీకారంతో పెళ్లిముడితో ఒక్కటయ్యారు. కాగా పెళ్లి తర్వాత చైతూ, శామ్ స్క్రీన్‌ని పంచుకోలేదు. అయితే ఓ మంచి లవ్‌స్టోరీ దొరికితే ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అని పలుమార్లు చెబుతూ వచ్చారు.
అయితే ఎట్టకేలకు ఓ లవ్‌స్టోరీ వీరిద్దరినీ ఇంప్రెస్ చేసిందట. ఆ లవ్‌స్టోరీని తీసుకొచ్చింది మరెవరో కాదు. నానితో 'నిన్నుకోరి' వంటి క్యూట్ అండ్ క్లీన్ లవ్‌స్టోరీని అందించిన యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ. శివ నిర్వాణ చెప్పిన లవ్‌స్టోరీ చైతూ, శామ్కి చాలా బాగా నచ్చిందట. దాంతో వెంటనే ఓకే చెప్పేశారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత నటించిన 'రంగస్థలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
అలనాటి మేటి నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న 'మహానటి' సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మరోపక్క తమిళంలో విశాల్‌తో సమంత నటించిన 'అభిమన్యు' కూడా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఇంకోపక్క చైతూ 'సవ్యసాచి' సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలోనూ చైతూ నటించాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే చైతూ, శామ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి పెళ్లి తర్వాత ఈ ప్రేమజంట కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదికి వెళుతుందా అని చై, శామ్తో పాటు అభిమానులు కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు.