అక్కినేని వారసుడు నాగ చైతన్య మొత్తానికి సింగిల్ లైఫ్ కి గుడ్ బై చెప్తూ శోభితతో ఏడడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 4 న వీరి వివాహ వేడుక జరగనుంది. ఇందుకు అన్నపూర్ణ స్టూడియో వేదిక కానుంది. ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. శుక్రవారం నాగార్జున ఇంట్లో హల్దీ వేడుకలు జరిగాయి. నూతన వధూవరులకు ఒకే దగ్గర మంగళస్నానాలు చేయించారు. సంప్రదాయబద్దంగా జరిగిన ఈ వేడుకలో ఇరు వైపుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజంట్ ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
చైతు, శోభిత పెళ్లి రాజస్థాన్ లో జరగాల్సి ఉండగా చివరికి అన్నపూర్ణ స్టూడియోకి మార్చారు. డిసెంబరు 4 ఎనిమిది గంటలకి సమూహర్తం నిశ్చయించారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని విగ్రహం ముందు వీరి పెళ్లి జరగనుంది. తాతగారి విగ్రహం ముందు పెళ్లి చేసుకుంటే ఆయన సమక్షంలో చేసుకున్నట్లే అని, తాతయ్య ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలనే ఉద్దేశంతో రెండు కుటుంబాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైతు పేర్కొన్నాడు. శోభితతో పెళ్లి పీఠల పైన కూర్చునే రోజు కోసం తాను చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నట్లు, తన జీవితంలో ఏర్పడిని శూన్యాన్ని శోభిత పూడుస్తుందని తాను నమ్ముతున్నట్లు చైతన్య ఆశగా ఉన్నాడు.
పెళ్లి కోసం చైతు పక్కాగా ట్రెడిషనల్ గా రెడీ అవుతున్నాడు. పంచె కట్టులో అచ్చమైన తెలుగింటి సంప్రదాయాన్ని పాటిస్తున్నారు నాగ్ ఫ్యామిలీ. చైతు పెళ్లి పెద్ద హంగు ఆర్భాటం లేకుండా జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియో ముస్తాబు అవుతోంది. టాలీవుడ్ ప్రముఖులకు ఇప్పటికే ఇన్విటేషన్స్ అందాయని, చాలా మంది సెలబ్రిటీలు ఈ పెళ్లి వేడుకకి రానున్నారు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళే కాకుండా, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా చైతు పెళ్ళికి అటెండ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైతు తో వర్క్ చేసిన దర్శక, నిర్మాతలు ఈవివాహ వేడుకకి హాజరుకానున్నారు.