పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటని చైతూను అడిగితే 'ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ' అని సమాధానమిచ్చాడు. ఎన్టీఆర్ సినిమాల్లో 'యమదొంగ', చరణ్ సినిమాల్లో 'రంగస్థలం', ప్రబాస్ సినిమాల్లో 'బాహుబలి', మహేష్ సినిమాల్లో 'పోకిరి' అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. భార్య సమంత గురించి అడిగితే 'సూపర్‌స్టార్ ఇన్ మై లైఫ్' అని చెప్పాడు. మహేష్‌ని సూపర్‌స్టార్‌గా అభివర్ణించాడు. ఎన్టీఆర్ కథల్ని ఎంచుకునే విధానం నచ్చుతుందన్నాడు. ఎన్టీఆర్ ఎనర్జీ అంటే ఇష్టమట. తమిళ హీరో అజిత్‌ని ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అభిమానిస్తాడట. ఏంటిది.! చైతూ ఇలా హీరోలందరి గురించీ తన మనసులోని అభిప్రాయాల్ని వరుస కట్టేశాడేంటా అనుకుంటున్నారా?
అవును చైతూ నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో కాసేపు సోషల్‌మీడియాలో సరదాగా ముచ్చటించాడు చైతూ. అలా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు చైతూ ఇలా సింపుల్‌గా సమాధానాలిచ్చాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం చైతూ పెళ్లి తర్వాత విడుదలవుతోన్న తొలి చిత్రం. ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి
. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ అత్త పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్‌గా ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రచార చిత్రాలతో ఆశక్తి రేపుతోంది. మరి బాక్సాఫీస్ విజయంలో ఎంత జోరు చూపిస్తుందో చూడాలిక.