సొగసరి వంపు సొంపు

మరిన్ని వార్తలు

'జై సింహా' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నటాషా దోషి. ఆ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా ఇంపార్టెన్స్‌ ఎక్కువ ఉన్న పాత్రే అది. బాలయ్యకు భార్యగా నటించింది. ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ బాగా పండించింది. తొలి సినిమా అయినా నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది. బాలయ్య పక్కన డాన్సుల్లో బీభత్సమైన ఎనర్జీ చూపించింది. అయితే ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదీ బ్యూటీ. పెద్దగా గ్లామర్‌ రోల్‌ కాదు కానీ, గ్లామర్‌ ప్రదర్శించడంలో పెద్దగా మొహమాటాలు లేవనే భావించాలి. వృత్తి డాక్టర్‌. కానీ యాక్టింగ్‌ అంటే ఆశక్తి ఉండడంతో సినిమాల్లోకి వచ్చింది. అనుకోకుండా ఫస్ట్‌ సినిమాకే నందమూరి నటసింహాం బాలయ్యతో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. తాజాగా సోషల్‌ మీడియాలో ఇదిగో ఇలా డిఫరెంట్‌ పోజులో సడెన్‌గా దర్శనమిచ్చింది. బ్లూ కలర్‌ స్కిన్‌ టైట్‌ కాస్ట్యూమ్‌లో తన వంపు సొంపుల్నిలా ప్రదర్శనకు పెట్టింది. మీరూ ఓ లుక్కేసి, అమ్మడి పోజుకు ఓ లైకేస్కోండి బాస్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS