నాగ చైతన్య గత రెండేళ్లుగా 'తండేల్' సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ సినిమా రిలీజ్ పై క్లారిటీ లేదు. మొదట నవంబర్ కి రిలీజ్ అన్నారు. అది కాస్తా వాయిదా పడింది. నెక్స్ట్ డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు కానీ ఏది కన్ఫామ్ కాలేదు. కానీ బడ్జెట్ మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. చైతూకి పెద్దగా మార్కెట్ లేకపోయినా తండేల్ కోసం 80 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. మొదట 60 నుంచి 70 కోట్లు అంచనాతో సినిమా స్టార్ట్ చేస్తే పూర్తి అయ్యేసరికి 80 అయ్యిందని సమాచారం. తండేల్ కి ముందు చైతు సినిమాలు ఏవి విజయం సాధించలేదు. మరి ఎందుకు ఇంత బడ్జెట్ పెడుతున్నారని అంతా ఆశ్చర్య పోతున్నారు. టైం కి రాకపోవటం తో నిర్మాతకి కష్టాలు తప్పవని అంతా అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉన్నారని టాక్.
పెద్ద హీరోల సినిమాలు, సక్సెస్ రేటు ఎక్కువ ఉన్న హీరోల సినిమాలే 100 కోట్ల బడ్జెట్ లేదు. అలాంటిది చైతు సినిమా 'తండేల్' 80 కోట్లు బడ్జెట్ అంటే అంతా చెవులు కొరుక్కున్నారు. కానీ నిర్మాతలు ప్రజంట్ సేఫ్ జోన్ లోనే ఉన్నారని, రిలీజ్ కంటే ముందే బడ్జెట్ వసూల్ అయిపోయిందని తెలుస్తోంది. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే 70 పర్శంట్ బడ్జెట్ రాబట్టారట. 'తండేల్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ 40 కోట్ల రూపాయలకు తీసుకుంది. అది కూడా హిందీ రైట్స్ మినహాయించి. ఆదిత్య మ్యూజిక్ 10 కోట్ల రూపాయలు పెట్టి 'తండేల్' సాంగ్స్ రైట్స్ కొనుగోలు చేసింది. అంటే ఓటీటీ సౌత్ రైట్స్, సాంగ్స్ రైట్స్ కలిపి 50 కోట్లుకి సెల్ అయ్యాయి.
ఇంకా హిందీ ఓటీటీ రైట్స్, థియేట్రికల్ రైట్స్ సేల్ చేయలేదు. చందు మొండేటి లాస్ట్ సినిమా 'కార్తికేయ 2' నార్త్ లో ఘనవిజయం సాధించింది. సో ఇప్పుడుకూడా చందు మేకింగ్ కి నార్త్ లో క్రేజ్ ఉంటుందని దాని క్యాష్ చేసుకోవటానికి మేకర్స్ ఇంకా ఓటీటీ రైట్స్, థియేటర్ రైట్స్ అమ్మలేదు. ఇవి కాకుండా తెలుగు శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ సేల్ చేస్తే ఇంకొక 20 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కలిపితే తండేల్ కి ముందే వసూళ్లు వచ్చేస్తున్నట్టు లెక్క. సో చైతు కూడా హ్యాపీ.