చైతు డబుల్ ట్రీట్

మరిన్ని వార్తలు

నాగ్ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చైతు కెరియర్ ప్రారంభం నుంచీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఒక్కో సినిమాకి లుక్ పరంగా వేరియేషన్స్ కూడా బాగా చూపించ గలుగుతున్నాడు. కథకి అనుగుణంగా  తన బాడీని మార్చుకోగల సత్తా ఉన్న చైతు ప్రస్తుతం తండేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. దీని తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో ఒక ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా, ఈ మూవీలో చైతు పాత్ర గురించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది.


విరూపాక్షతో అందరి ద్రుష్టిని తన వైపు తిప్పుకున్న కార్తీక్ దండు ఇప్పుడు నాగచైతన్య కోసం ఓ విభిన్నమైన మిస్టిక్ థ్రిల్లర్‌ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో చైతూ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని టాక్. చైతు కెరీర్ లో ఇప్పటి వరకూ ద్విపాత్రాభినయం చేయలేదు. ఇదే తన మొదటి సినిమా అవుతుంది. డ్యూయెల్ రోల్ లో చైతు ఎలా కనిపించనున్నారో అన్న ఆసక్తి ఇప్పుడు ఫాన్స్ లో మొదలయ్యింది. ఇంతక ముందు ఇలాంటి ప్రపోజల్ వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. గతంలో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో హలో బ్రదర్ రీమేక్ తెరెకెక్కుతుందని,  చైతన్య డబుల్ రోల్ లో నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ అది చర్చల దశలోనే ఆగిపోయింది. మళ్ళీ  ఇన్నాళ్లకు కార్తీక్ దండు సినిమాలో డ్యూయెల్ రోల్ లో చైతు కనిపించనున్నాడు.


దూత వెబ్ సిరీస్‌ తో థ్రిల్లర్ జోనర్ లో హిట్ కొట్టిన చైతు ఇప్పుడు కూడా మరో హిట్ గ్యారంటీ అని ధీమాగా ఉన్నారు. దీంట్లో లవ్ స్టోరీ కూడా కీలకమని, అందుకే చైతూకి జోడీగా పూజా హెగ్డేను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ ఈ జంట స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసి అక్టోబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని, నవంబర్ లో చై బర్త్ డే నాటికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS