హీరో శర్వానంద్ గప్ చుప్ గా వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తున్నాడు. రీసెంట్ గా మనమే సినిమాతో థియేటర్స్ లో సందడి చేసి, పర్వాలేదనిపించుకున్న శర్వా ఇప్పుడు మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ బ్యానర్ శర్వానంద్ కి బాగా కలిసొచ్చిన బ్యానర్. ఇంతక ముందు రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాలు చేశాడు. ఈ మూడు పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నాయి, యాక్టింగ్ పరంగా కూడా శర్వా కొత్తగా కనిపించాడు. ఇప్పుడు మళ్ళీ యూవీ బ్యానర్లోనే నాలుగో సినిమాకి సిద్ధం అయ్యాడు.
అభిలాష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథకి 'రేస్ రాజా' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు టాక్. శర్వానంద్ 36వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించటం ఇదే మొదటిసారి. రీసెంట్ గా కల్కి లో ఉత్తర పాత్రలో నటించింది మాళవిక, ఇప్పుడు శర్వానంద్ తో జోడి కట్టనుంది. ఈ కాంబినేషన్ పట్ల ప్రేక్షకులకి ఆసక్తి మొదలయ్యింది.
మేకర్స్ రేస్ రాజా ఫస్ట్ లుక్ పోస్టర్ ని శర్వానంద్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేయనున్నారంట. రేస్ రాజాలో శర్వా ఎనర్జీ అండ్ ఫన్ ని మరోసారి ఆడియన్స్ ఆస్వాదిస్తారని, గత మూడు సినిమాల మాదిరిగానే ఇది కూడా సూపర్ హిట్ అని భావిస్తున్నారు మేకర్స్.