నాగ చైనత్య కొత్త సినిమా ఖారరైయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేయబోతున్నాడు చైతు. గతంలో వీరి కలయికలో సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. అయితే మొదటిసారి దర్శకుడు వెంకట్ ప్రభు నుంచి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'మన్మథ లీల’ సినిమా ప్రమోషన్లలో భాగంగా తర్వాతి సినిమా గురించి చెబుతూ.. తెలుగు హీరో నాగచైతన్యతో తానో సినిమా చేయబోతున్నట్లు ధ్రువీకరించాడు వెంకట్ ప్రభు.
అంతేకాదు .. 'మనాడు' సినిమాని చైతు కోసం రీమేక్ చేస్తున్నట్లుగా వచ్చిన వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. చైతుతో చేస్తున్న సినిమా రీమేక్ కాదని, కొత్త కథతో సినిమాని చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాని తెలుగు తమిళ్ రెండు బాషల్లో చిత్రీకరించనున్నారు. నాగ చైనత్య ప్రస్తుతం ‘థ్యాంక్ యు’ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదే కాకుండా విక్రమ్ డైరెక్షన్ లోనే ‘దూత’ అనే హార్రర్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ‘థ్యాంక్ యు’ విడుదలైన తర్వాత వెంకట్ ప్రభు సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది.