నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. దీనికి `థ్యాంక్యూ` అనే టైటిల్ పరిగణించినట్టు సమాచారం. ప్రస్తుతం విక్రమ్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు కథానాయిక కోసం అన్వేషణ జోరందుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా ఒకరికే అవకాశం కానీ ఆ పాత్ర కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. సమంత, రష్మిక, కీర్తి సురేష్‌లలో ఒకరిని నాయికగా ఫిక్స్ చేసే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తోంది. ముందు సమంత కాల్షీట్ల కోసం ప్రయత్నిస్తారు. ఆ తరవాతి ఛాన్స్ రష్మికదే.
రష్మిక కూడా బిజీ అంటే అప్పుడు కీర్తి సురేష్ కోసం వెళ్తారు. ఈ ముగ్గురిలో ఒకరు మాత్రం ఖాయం. అదెవరన్నది వాళ్లవాళ్ల కాల్షీట్లని బట్టి, ఖాళీని బట్టి ఆధార పడి ఉంటుంది. `మనం` తరవాత అఖిల్‌తో `హలో` తీశాడు విక్రమ్. అది ఫ్లాప్ అయ్యింది. అయినా సరే, విక్రమ్‌పై అభిమానంతో, నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు అక్కినేని హీరోలు. ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.