వెబ్ సిరీస్‌లకు ఆదరణ రోజు రోజుకీ ఎక్కువ అవుతోంది. తెలుగు వాళ్లూ ఇప్పుడు వెబ్ సిరీస్‌లకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో మన స్టార్స్ సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ వరుసగా వెబ్ సిరీస్‌లను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా `షాడో` సిరీస్ ని ప్రకటించింది. మరోవైపు వాస్తవ సంఘటనల సమాహారంగా మరో వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తోంది. ఇందులో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తారు. దర్శకుడు ఎవరన్నది త్వరలో తేలుతుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. `షాడో`కి తగిన హీరో కోసం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అన్వేషిస్తోంది. ఆ వెబ్ సిరీస్ లో ఓ బాలీవుడ్ హీరో నటించే అవకాశాలున్నాయని సమాచారం.