పవన్ కల్యాణ్.... టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించగల అతి కొద్ది మంది హీరోల్లో.. తన పేరు ముందు వరుసలో ఉంటుంది. పవన్ ఫ్లాప్ సినిమా సైతం... తొలి మూడు రోజుల్లోనే రికార్డు వసూళ్లు కురిపిస్తుంది. అలాంటిది... పవన్ సినిమా హిట్టయితే, ఆ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా టైమ్ లో కూడా `వకీల్ సాబ్` తన జోరు చూపించింది. అదీ... పవన్ స్టామినా. పవన్ సినిమా వస్తుందంటే, మిగిలిన సినిమాలన్నీ సైడ్ అయిపోవాల్సిందే. స్టార్ హీరోలు సైతం, పవన్ కి దారి ఇస్తారు. అయితే.. ఇప్పుడు నాగచైతన్య మాత్రం పవన్ ని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నాడు.
పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.అదే.. `హరి హర వీరమల్లు`. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. జనవరి 14న ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే... సరిగ్గా అదే రోజున, నాగచైతన్య `థ్యాంక్యూ`ని సైతం విడుదల చేస్తారని టాక్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లున్నారు. ఈసారి విక్రమ్ ఫ్యామిలీ అంశాల్ని దట్టించి కథ రాసుకున్నాడట. ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్టులకు సంక్రాంతి మంచి సీజన్. అందుకే ఈ సినిమాని సరిగ్గా సంక్రాంతికి విడుదల చేద్దామని ఫిక్సయ్యారు. పవన్ సినిమా - నాగచైతన్య సినిమా ఒకే రోజు వస్తే... చైతూ సినిమాకే దెబ్బ. కానీ... ఈసినిమాకి దిల్ రాజు నిర్మాత. తనకు సంక్రాంతి సీజన్‌లో సినిమా రిలీజ్ చేసి, హిట్టు కొట్టిన చరిత్ర ఉంది. అందుకే సంక్రాంతికే టార్గెట్ చేశాడట. ప్రస్తుతానికైతే.. థ్యాంక్యూ ప్లానింగ్ సంక్రాంతికే. భవిష్యత్తులో మారుతుందేమో చూడాలి.