'జోష్' సినిమాతో స్టూడెంట్ పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని బుల్లోడు నాగ చైతన్య. తొలి సినిమాతో ఓకే అనిపించాడు. ఆ తర్వాత మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని చాలా తపన పడ్డాడు. రామ్ గోపాల్ వర్మతో 'బెజవాడ' తదితర సినిమాలతో మాస్ హీరో అనిపించుకోవాలని ట్రై చేసి, బోర్లా పడ్డాడు చైతూ. దాంతో ఇదంతా తనకు వర్క్ అవుట్ కాదనుకున్నాడు కాబోలు, మళ్లీ లవర్ బోయ్, క్లాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేశాడు. సక్సెస్ అయ్యాడు. 'ప్రేమమ్', సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఇటీవల 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాతో మరో క్లాసికల్ హిట్‌ని అందుకున్నాడు. అయినా కానీ మనోడికి మాస్ హీరో అనిపించుకోవాలన్న తపన మాత్రం తీరడం లేదు. అందుకే మరోసారి మాస్ రోల్ ట్రై చేశాడు. ఈ సారి 'యుధ్దం శరణం' అంటూ వస్తున్నాడు. సైలెంట్‌గా ఈ సినిమాని పూర్తి చేసేశాడు చైతూ. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా సక్సెస్‌ని ఇంకా అక్కినేని అభిమానులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇంతలోనే చైతూ సైలెంట్‌గా తన నెక్స్ట్ సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఆర్.వి. మరిముత్తు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే నెల్లోనే ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. వరుస హిట్లతో జోరు మీదున్న నాగ చైతన్యకు ఈ సినిమాతో మాస్ ఇమేజ్ రావడం ఈ సారి పక్కా అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ సినిమాలో చైతూ సరసన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది.