యంగ్ హీరో నాగశౌర్య, 'ఛలో' సినిమాకి నిర్మాతగా కూడా మారాడు. నటిస్తూ, సినిమాని నిర్మించడమంటే అది పెద్ద రిస్కే. కానీ ఆ రిస్క్‌ని చాలా కాన్ఫిడెంట్‌గా చేశాడు నాగశౌర్య. కొత్త దర్శకుడు వెంకీ కుడుములను పూర్తిగా నమ్మిన నాగశౌర్య, తన నమ్మకం కాదని నిరూపించేశాడు.
తన మీద నాగశౌర్య పెట్టుకున్న నమ్మకాన్ని వెంకీ కుడుముల కూడా వమ్ము చేయలేదు. కొత్త భామ రష్మిక మండన్న అప్పీయరెన్స్, సినిమాలో కంటెంట్, అన్నీ బాగా కలిసొచ్చాయి. 'ఛలో'తోపాటుగా రవితేజ 'టచ్ చేసి చూడు' సినిమా విడుదలైనా, ఆడియన్స్ ఓటు మాత్రం 'ఛలో'కే పాజిటివ్‌గా పడింది. 'ఛలో' సినిమాకి చేసిన ప్రమోషన్ అలాంటిది. ప్రమోషన్ ఒక్కటే సినిమాల్ని కాపాడేయదు కానీ, ఆ ప్రమోషన్ కూడా ఎంతో కొంత అవసరమే. సినిమా పబ్లిసిటీ కోసం చాలా ఖర్చు చేశారంటూ 'ఛలో' విడుదలకు ముందు ప్రచారం జరిగింది. అప్పుడే నాగశౌర్య చాలా రిస్క్ చేసేస్తున్నాడని అనుకున్నారంతా.
అంత రిస్క్ ఆయన ఎందుకు చేశాడో 'ఛలో' విడుదలయ్యాక, సక్సెస్ టాక్ రాబట్టుకున్నాకే అందరికీ అర్థమయ్యింది. మ్యూజిక్ దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ 'టచ్ చేసి చూడు' కంటే 'ఛలో'దే పైచేయి అన్పించుకుంది. మాస్ మహరాజ్ దెబ్బకి 'ఛలో' విలువిల్లాడుతుందని అంతా అంచనా వేసినా, 'ఛలో' ముందు 'టచ్ చేసి చూడు' తేలిపోయిందని చెప్పక తప్పదు.
ఏదేమైనా ఈ విషయంలో నాగశౌర్యని అభినందించాలి. కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం, నిర్మాతగా మారడం, సినిమా ప్రమోషన్‌ని పెర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో చేయడం, ఇన్ని ఒత్తిళ్ళు వున్నా, తెరపై తన నటనకు అవేవీ ఇబ్బంది కాకుండా చూసుకోవడం - ఇదంతా నాగశౌర్య ఘనతే.