కుర్రోడు అంటే మరెవరో కాదు మన యంగ్ హీరో నాగశౌర్య. మనోడు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం 'ఛలో' సినిమాలో నటిస్తున్నాడు నాగశౌర్య. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో ఈ యంగ్ అండ్ డైనమిక్ ఫుల్ జోష్‌గా పాల్గొంటున్నాడు.
ఓ పక్క మనోడికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత యూత్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే యూత్‌కి మరింత చేరువగా వెళ్తున్నాడు. ప్రమోషన్స్ నిమిత్తం కాలేజీ కుర్రోళ్లను కలుస్తూ, వాళ్లతో సెల్ఫీలు దిగుతూ, స్టేజ్‌పై డైలాగులు, అమ్మాయిలతో స్టెప్పులూ అబ్బో మనోడి జోరు ఓ రేంజ్‌లో ఉందన్న మాట. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'ఛలో' సినిమాపై భారీ అంచనాలున్నాయి. మనోడి లిస్టులో ఇప్పటికే 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్చుతానంద', తదితర హిట్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా వాటిన్నింటికీ భిన్నంగా యూత్‌ని ఇంకా బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. మాస్ ఎలిమెంట్స్‌తో కూడా క్లాస్ టచ్ కనిపిస్తోంది. ట్రైలర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు.
వినోదం, యాక్షన్, లవ్ ఇలా అన్ని అంశాల్లోనూ ట్రైలర్ కొత్తగా ఎట్రాక్ట్ చేస్తోంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరో పక్క ఈ సినిమాలో మనోడితో జత కడుతోన్న ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. ఈ ముద్దుగుమ్మకి ఇది తొలి సినిమానే అయినా కానీ విడుదలకు ముందే, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించేసింది. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
అన్నట్లు నాగశౌర్య 'ఛలో' ప్రమోషన్స్‌లో డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. బహుశా తన నెక్ట్స్ సినిమాలో ఈ గెటప్‌తో కనిపించనున్నాడో ఏమో కానీ, ఎప్పుడూ నీట్ షేవ్‌తో కనిపించే నాగ శౌర్య గెడ్డంతో, కొంచెం బొద్దుగా కనిపిస్తూ సరికొత్త లుక్‌తో యూత్‌ని భలే ఎట్రాక్ట్ చేస్తున్నాడులే..!