బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం చాలా కష్టపడుతున్నట్టు సమాచారం.
ఇప్పటికే సాహో చిత్రం షూటింగ్ సగం వరకు పూర్తవ్వగా, ఈ చిత్రంలో ప్రభాస్ పైన స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయి అని యూనిట్ వర్గాల సమాచారం. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రభాస్ స్కూబా డైవింగ్ కూడా నేర్చుకున్నాడట, సముద్రంలో కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీయనుండడమే దీనికి కారణంగా తెలుస్తున్నది.
అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ధా కపూర్ కూడా సాహో చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇప్పటికే తీసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాలో ఎక్కువ శాతం యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
బాహుబలి తో ఏర్పడిన క్రేజ్ ని సాహో తో కూడా కొనసాగించడానికి ప్రభాస్ బాగానే కష్టపడుతున్నట్టుగా తెలుస్తున్నది.