'నర్తనశాల' వీడు చాలా తేడా.!

By iQlikMovies - August 07, 2018 - 19:15 PM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నాగశౌర్య తాజా చిత్రం 'నర్తనశాల'. తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. టీజర్‌లో 'చిన్నప్పటి నుండీ అమ్మాయిలా పెరిగాడు. వీడికి 'ఆ' ఫీలింగ్స్‌ ఎలా వస్తాయి.? నా కొడుకు గే నా..' అని శివాజీరాజా చెబుతున్న డైలాగ్‌ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. మొత్తానికి ఈ సినిమాలో నాగశౌర్య కొంచెం తేడా అయిన పాత్ర పోషిస్తున్నాడని టీజర్‌ చూస్తే అర్ధమైపోయింది. 

టీజర్‌కి ముందే నాగశౌర్య క్యారెక్టర్‌పై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది క్యారెక్టర్‌పై కాదు, టైటిల్‌పై. 'నర్తనశాల' అనే టైటిల్‌కి చాలా పవిత్రత ఉంది. ఆ పవిత్రతను దెబ్బ తీసేలా ఈ సినిమా స్టోరీ ఉందని అభ్యంతరాలు వచ్చాయి. అయితే వెంటనే చిత్ర యూనిట్‌ స్పందించింది. ఈ సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఇంటర్వెల్‌ టైంలోనే క్లారిటీ వచ్చేస్తుంది. ఆ పేరుకు ఉన్న పవిత్రతకు భంగం కలిగేలా ఏమాత్రం ఈ సినిమా ఉండదని చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది. 

ఇకపోతే ఈ తరహా క్యారెక్టర్స్‌లో ఇప్పటికే పలువురు యంగ్‌ హీరోలు నటించేశారు. తాజాగా 'నర్తనశాల'తో నాగశౌర్య ఈ ప్రయోగం చేయబోతున్నాడు. టీజర్‌లో ఈ క్యారెక్టర్‌తో చాలా ఫన్‌ క్రియేట్‌ చేశాడు నాగశౌర్య. 'ఛలో' సినిమాతో హిట్‌ కొట్టిన నాగశౌర్య 'నర్తనశాల'తో ఏం చేస్తాడో చూడాలి మరి. 

క్యారెక్టర్‌ ఆ టైప్‌ అయినా కానీ, మనోడు ఈ సినిమాలో యామినీ భాస్కర్‌, కశ్మీరా అనే ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయబోతున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS