అందాల భామ రాశీఖన్నా తన పెళ్లి విషయంలో పెదవి విప్పింది. పెళ్లంటూ చేసుకుంటే తెలుగబ్బాయినే చేసుకుంటానంటోంది. ఇంతకీ ఇంత సడెన్‌గా రాశీఖన్నాకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రావడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అందుకూ ఓ రీజన్ ఉందండోయ్. రాశీఖన్నా ప్రస్తుతం 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని పెళ్లి తంతు చూశాక ఆమెకు ఈ పెళ్లి ఆలోచన వచ్చిందట.
సినిమాలో పెళ్లి ఎపిసోడ్ చాలా చాలా బాగా చూపించారన్న సంగతి, సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా, ప్రోమోస్ చూస్తున్న మనందరికీ తెలుసు. ఇక సినిమాలో నటించిన రాశీఖన్నా సంగతేంటి? అందుకే ఆ రకంగానే తన రియల్ లైఫ్ పెళ్లి కూడా జరగాలంటే తెలుగబ్బాయిని చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. అందులోనూ మన దిల్‌రాజుగారి సినిమాల్లో పెళ్లి ఎపిసోడ్ అంటే పండగే. రాశీఖన్నాకే కాదు, ఈడొచ్చిన ప్రతీ అమ్మాయికీ, అబ్బాయికీ దిల్‌రాజు సినిమాల్లోని పెళ్లి స్టైల్‌లోనే పెళ్లి జరిగితే ఎంత బావుండు అనుకుంటారు.
కానీ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కానీ సినిమా చూస్తున్నంత సేపూ తెలియని ఓ ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతుంటాం. ధియేటర్ నుండి బయటికి వచ్చాక కూడా ఆ పెళ్లి ఎపిసోడ్ ముచ్చట్లు అస్సలు మర్చిపోలేం. అంతలా రిజిస్టర్ చేసేస్తుంటారు దిల్‌రాజు తన సినిమాల్లో పెళ్లి తంతును. అందుకే నటనే అయినా, రీల్ లైఫ్ పెళ్లి ఎపిసోడ్‌లో నటించిన ముద్దుగుమ్మ రాశీఖన్నా, రియల్ లైఫ్‌లోనూ అసలు సిసలు తెలగబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానన్న తన మనసులోని తాజా నిర్ణయాన్ని ఇలా బయట పెట్టిందన్న మాట.