కండ‌లు పెంచిన శౌర్య‌

మరిన్ని వార్తలు

ప్రేమ‌క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ గా నిలిచాడు నాగ‌శౌర్య‌. అయితే ప్ర‌తీసారీ ల‌వ్ స్టోరీలు చేసీ చేసీ బోర్ కొట్టిన‌ట్టుంది. ఇప్పుడు ఓ స్పోర్ట్స్ డ్రామాని ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌కుడు. కృతిక శ‌ర్మ క‌థానాయిక‌. ఇందులో ఓ ఆర్చ‌రీ క్రీడాకారుడిగా క‌నిపించ‌బోతున్నాడు శౌర్య‌.

 

ఈ సినిమా కోసం త‌న బాడీని పూర్తిగా మార్చుకున్నాడు. వ‌ర్క‌వుట్లు చేసి, జిమ్ లో గంట‌ల కొద్దీ క‌ష్ట‌ప‌డి కండ‌లు పెంచాడు. ఓ ప్రొఫెష‌న‌ల్ అథ్లైట్ లా మారాడు. ఇప్పుడు శౌర్య‌ని చూస్తే క‌చ్చితంగా ఆశ్చ‌ర్య‌పోతారు. అలా మారిపోయాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ బ‌య‌ట పెట్టారు. ఫ‌స్ట్ లుక్ సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు శేఖ‌ర్ క‌మ్ముల చేతుల మీదుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS