నాగశౌర్య, రష్మికా మండన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఛలో'. ఫస్ట్‌లుక్‌నే చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. ఇక సినిమాకి ఇంకా కొత్తగా తెరకెక్కించారట. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ క్యూట్ లవ్‌స్టోరీ. అయితే ఇంతవరకూ లవ్‌స్టోరీస్ చాలానే వచ్చాయి. వాటిన్నింట్లోకీ మా లవ్ స్టోరీ వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు నాగ శౌర్య, రష్మికా.
ఈ సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ రష్మికా మండన్నా, కన్నడలో 'కిరిక్ పార్టీ' సినిమాతో పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నాగశౌర్య సంగతి తెలిసిందే. మనోడు స్క్రీన్‌పై నటించడు. జీవించేస్తాడు. 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో లవ్ సీన్స్‌లో మనోడి టాలెంట్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఏ సినిమా తీసుకున్నా, అన్నా దమ్ముల అనుబంధంగా తెరకెక్కిన 'జ్యో అచ్చుతానం' చిత్రం కూడా అంతే. నారా రోహిత్‌కి తమ్ముడి పాత్రలో నటించి ఆడియన్స్ మనసు దోచేశాడు.
ఇప్పుడు చేయబోతున్న ఈ చిత్రం 'ఛలో' కోసం మన అల్లరి పిల్లోడు ఏం చేస్తాడంటే.. అది తెరపైనే చూడాలండోయ్. త్వరలోనే సినిమా విడుదల అయిపోతుందిలెండి. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాలేజ్.. ఆ కాలేజ్‌లోని క్యూట్ అమ్మాయి, స్వీట్ అబ్బాయి మధ్య లవ్‌స్టోరీ అన్నమాట. ఇలాంటి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వచ్చుండచ్చు. కానీ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించిన విధానం ఆశక్తిగా ఉండనుందట.
హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉంటాయట. చాలా హృద్యంగా ఉండనున్నాయట ఆ సీన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తామంటోంది చిత్ర బృందం.