నాగశౌర్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'కణం'. ఇదో బై లింగ్వల్ చిత్రం. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. అయితే ఈ సినిమాపై అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి హీరో నాగశౌర్య హాజరు కాలేదు. ఇప్పుడీ విషయం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. హీరో రాకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏంటి అని పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందులో భాగంగా, సాయిపల్లవికీ, నాగశౌర్యకీ మధ్య గల విబేధాలే ఇందుకు కారణం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గత కొంత కాలంగా నాగశౌర్యకీ, సాయిపల్లవికీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. సాయిపల్లవికి ఇగో ఎక్కువనీ, అలా బిహేవ్ చేయడం మంచిది కాదనీ నాగశౌర్య అంటున్నాడు. తాను చేసిన తప్పేం లేదనీ, తన పట్ల నాగశౌర్య అలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదనీ సాయి పల్లవి అంటోంది. ఇంతకీ వీరి మధ్య రేగిన వివాదానికి అసలు కారణాలేంటో తెలియవు కానీ, సాయిపల్లవి కూడా ఏమంత తప్పుగా మాట్లాడింది లేదని అయితే అర్ధమవుతోంది
. అయితే వీరి తగాదాల సంగతి అటుంచితే, మరోపక్క 'కణం' విడుదలకు సిద్ధమయింది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ వీరి మధ్య విబేధాలను జీర్ణించుకోలేకపోతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి హాజరు కాని కారణంగా, చిత్ర యూనిట్, నాగశౌర్యతో సంప్రదింపులు జరుపుతోంది. ఇకపై అయినా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలనీ కోరుతోంది.
అయితే ఏం జరుగుతుందో చూడాలి మరి. సినిమాలో ఈ ఇద్దరూ చాలా బాగా నటించారనీ, ఇద్దరికీ 'కణం' ఓ మంచి సినిమా అవుతుందనీ చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది.