'కణం' వచ్చేదెప్పుడంటే.!

By iQlikMovies - April 21, 2018 - 17:29 PM IST

మరిన్ని వార్తలు

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'కణం'. ఇదో బైలింగ్వల్‌ మూవీ. తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఎప్పుడో ఈ చిత్రం షూటింగ్‌ కంప్లీట్‌ అయిపోయినప్పటికీ, విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. అప్పుడెప్పుడో మూడు నెలల క్రితమే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. 

బైలింగ్వల్‌ మూవీస్‌కి సాధారణంగా ప్రాబ్లమ్స్‌ వస్తుంటాయి. అయితే 'కణం' విషయంలో ఆ ఆలస్యం మరింత ఎక్కువైంది. విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ ఎట్టకేలకు సెట్‌ అయ్యింది. ఈ నెల 27న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిత్ర యూనిట్‌ లేటెస్టుగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్‌ టైంలో హీరో నాగశౌర్యకు, హీరోయిన్‌ సాయి పల్లవికి మధ్య ఏవో బేధాభిప్రాయాలు వచ్చిన కారణంగా 'కణం' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి హీరో నాగశౌర్య హాజరు కాలేదు. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్యా సైలెంట్‌ వార్‌ జరిగింది. అయితే ఇప్పుడది సద్దుమణిగినట్లేనని తెలుస్తోంది. 

ఈ సినిమాలో భార్య భర్తలుగా నటించారు వీరిద్దరూ. వీరికి ఒక పాప కూడా ఉంది. తల్లీ కూతురు మధ్య సాగే ఎమోషన్స్‌ని ఈ చిత్రంలో చాలా బాగా చూపించారట. నాగశౌర్య, సాయి పల్లవి ఇద్దరికీ ఈ సినిమా ప్రత్యేకమైనదే. ఇద్దరి పాత్రలూ చాలా కొత్తగా డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ సంగతిటుంచితే, నాగశౌర్య ఇటీవల 'ఛలో'తో మంచి విజయం అందుకున్నాడు. సాయి పల్లవి ప్రస్తుతం శర్వానంద్‌తో 'పడి పడి లేచె మనసు' సినిమాలో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS