యంగ్ హీరో నాగ శౌర్య పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నవంబర్ 20న అనూషతో వివాహం జరగనుంది. బెంగుళూరు జెడబ్ల్యు మారియట్ వివాహ వేడుకలకు వేదిక కానుంది. ఉదయం 11:25 పెళ్లి ముహూర్తం.
నవంబర్ 19వ తేదీన జరిగే మెహందీ ఫంక్షన్‌తో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయి, మెహందీ, వివాహ వేడుకలకు వేర్వేరు దుస్తుల కోడ్‌లు ఉంటాయి. బెంగళూరులో రెండు రోజుల పాటు జరగనున్న వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.