సాహో ప్రభావం ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమాపై పడింది. సాహోతో పాటు... రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. దాదాపు సగం సినిమాపూర్తయ్యింది. నవంబరులో కొంత మేర షూటింగ్ జరగాల్సింది. కానీ... ఒక్క సీన్ కూడా షూట్ చేయలేదు. దానికి కారణం.. కథలో కీలకమైన మార్పులు చేయడమే అని టాక్.
అవును.. సాహో ప్రభావంతో ఈసారి కథపై మరింత దృష్టి పెట్టాడట ప్రభాస్. కథలో క్లారిటీ లేకపోతే సినిమా ముందుకు తీసుకెళ్లవద్దు.. అని చెప్పేశాడట. దాంతో రాధాకష్ణ మరోసారి స్క్రిప్టులో మార్పులు చేయడం మొదలెట్టాడట. ఇదో లవ్ స్టోరీ. అయితే యాక్షన్ కి చోటు ఉంది. ఆ యాక్షన్ డోసు తగ్గించాలన్నది ప్రభాస్ ఆలోచన. దాంతో బడ్జెట్ కూడా కంట్రోల్‌లోకి వస్తుంది. అందుకే ఈ సినిమా ప్రస్తుతానికి ఆగింది. జవవరిలో కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలున్నాయి. 2020 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.