మెగా మదర్‌ని శ్రీరెడ్డి అసభ్యంగా మాట్లాడింది. ఈ విషయంలో మెగా బ్రదర్ స్పందించారు. మా తల్లిని అన్నందుకు మాకు చాలా కోపమొచ్చింది కానీ, భరించాం. ఆడకూతురు కదా అని వదిలేశాం. అమ్మ చెప్పింది ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ చేసేయండి అని అమ్మ చెప్పింది అందుకే వచ్చాను అని మెగా బ్రదర్ అన్నారు.
సైలెంట్‌గా ఉన్నామని మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఎలా రియాక్ట్ అవుతామో మాక్కూడా తెలియదు. సహనాన్ని పరీక్షించొద్దు. దయచేసి మా జోలికి రాకండి అని నాగబాబు హెచ్చరించారు. జనసేన పార్టీ తరపున ఓ మంచి పని కోసం పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లిపోయాడు. తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా పట్టించుకోవద్దు అని ఫ్యాన్స్‌కి కళ్యాణ్‌బాబు ఎప్పుడో చెప్పాడు. తప్పు చేస్తే పబ్లిగ్గా ఒప్పుకునే ధైర్యం ఉన్నోడు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని ఆవేదనతో చెప్పాడు నాగబాబు. దయచేసి పర్సనల్ ఇష్యూస్ జోలికి రావద్దు అన్నారు.
కాస్టింగ్ కౌచ్‌కి నేను వ్యతిరేకం. అయినా కాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచం మొత్తం ఉంది. ఇది కొత్తగా పుట్టిన అంశం కాదు, నటి శ్రీరెడ్డి ఇష్యూని తప్పుదోవ పట్టిస్తోందని నాగబాబు అన్నారు. ప్రతీ చిన్న విషయాన్ని ఇండస్ట్రీ పేరుతో బ్లేమ్ చేయొద్దని అన్నారు. ఇండస్ట్రీపై నమ్మకం ఉంది కాబట్టే నా కూతుర్ని హీరోయిన్‌ని చేశానన్నారు నాగబాబు.
ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా అమ్మాయిలకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే, అప్పటికప్పుడు చెప్పు తీసి కొట్టండి లేదా, పోలీసులకు ఫిర్యాదు చేయండి. పోలీస్ వ్యవస్థ గొడ్డుపోలేదు, చట్టాలు, న్యాయాలపై మాకు నమ్మకం ఉంది. దయచేసి ఇండస్ట్రీని చులకన చేయకండి అని నాగబాబు స్పష్టం చేశారు.