100 వ‌ సినిమాలో అదే స్పెష‌ల్

మరిన్ని వార్తలు

నంద‌మూరి బాల‌కృష్ణ వంద సినిమాలు `గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి`తో పూర్త‌య్యాయి. చిరంజీవి `ఖైదీ నెం 150`తో 150 సినిమాల్ని పూర్తి చేశాడు. ఇప్పుడు నాగార్జున వంతు వ‌స్తోంది. త్వ‌ర‌లోనే వంద సినిమాల మైలు రాయిని అందుకోబోతున్నాడు నాగార్జున‌. వందో సినిమా అంటే ఏదో ఓ ప్ర‌త్యేక‌త ఉండాలి క‌దా? అందుకే దాని వైపుగా నాగ్ దృష్టి సారించాడు. నాగ్ వందో సినిమా ఓ మ‌ల్టీస్టార‌ర్ అని తేలింది.

 

ఈ విషయాన్ని నాగార్జున ధృవీక‌రించాడు కూడా. త‌న వందో సినిమాకి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయని, ఇదో మ‌ల్టీస్టార‌ర్ అని క్లారిటీ ఇచ్చేశాడు నాగ్. అయితే.. నాగ్ తో క‌నిపించే మ‌రో హీరో ఎవ‌రన్న‌ది క్లారిటీ ఇవ్వ‌లేదు. ఆ హీరో అఖిల్ అని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. నాగ్ - అఖిల్ ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ రాబోతోంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం మొద‌లైంది.

 

అది 100వ సినిమానే అని ఇప్పుడు తేలిపోయింది. త్వ‌ర‌లోనే ఈసినిమాకి సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS