కచ్చితంగా హిట్ కొట్టాలనే భావనతో అఖిల్ తన రెండో సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.
అయితే ఇప్పటికే షూటింగ్ ప్రారంబించిన ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు. హీరోయిన్ కోసం యూనిట్ సభ్యులంతా తీవ్రంగా వెతుకుతున్నారు. ఇంతలో శ్రీదేవి కూతురిని అఖిల్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
వీటి పై నాగార్జున స్పందిస్తూ- ఇవన్ని ఒట్టి పుకార్లే అని తేల్చేశాడు. దీనితో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న మళ్ళీ మొదటికి వచ్చింది.
సో... అఖిల్ కి ఇంకా హీరోయిన్ దొరకలేదు అనమాట!