రాజు గారి గది 2లో మొదటిసారిగా తన మొత్తం కెరీర్ లోనే వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాడు కింగ్ నాగార్జున.
ఈరోజు ఉదయమే విడుదలైన రాజు గారి గది 2 ట్రైలర్ లో ఆయన పాత్ర అందరిని మెప్పిచంది. అలాగే ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఈ ట్రైలర్ కన్నా ముందు సదరు చిత్ర యూనిట్ ఒక ట్రైలర్ ని కట్ చేసి నాగార్జునకి పంపారట. అయితే అది అస్సలు బాగలేకపోవడంతో నాగార్జున తిప్పి పంపేశాడట.
ఇక వెంటనే దర్శకుడు ఓంకార్.. నాగార్జున కి ఫోన్ చేసి తనకి ఒక్కరోజు టైం ఇస్తే తాను కొత్త ట్రైలర్ చేసి ఇస్తాను అని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్న ట్రైలర్ పంపించారని చెప్పాడు. ఈ ట్రైలర్ తనకి బాగా నచ్చి ఒక్క కట్ కూడా చెప్పలేదు అని చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ సినిమాకి సంబందించిన సిజీ వర్క్ కూడా తనకి నచ్చితేనే డబ్బింగ్ చెబుతానని దర్శక-నిర్మాతలకి తేల్చి చెప్పను అని అందరికి చెప్పి ఆశ్చర్యపరిచాడు.
దీన్నిబట్టి చూస్తే, పర్ఫెక్షన్ కోసం తపించడంలో నాగ్ తరువాతే ఎవరైనా మరోసారి నిరూపించాడు.