అఖిల్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రెండో సినిమా అయినా కానీ తొలి సినిమాగా రీ లాంఛ్ చేస్తున్నారు ఈ సినిమాని. ఈ సినిమా పట్ల నాగార్జున చాలా నమ్మకంగా ఉన్నాడు. 'మనం' టైటిల్‌తో అక్కినేని ఫ్యామిలీ మూవీని అత్యద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ విక్రమ్ కుమార్‌ని ఎంచుకోవడంతోనే నాగ్‌కి సగం బాధ్యత తీరిపోయింది. అన్నీ తానై అంతా తానై ఈ సినిమా బాధ్యతని తన భుజాల పైకి ఎక్కించుకున్నాడు డైరెక్టర్ విక్రమ్ కుమార్. ఈ సినిమాకి కథే హైలైట్ అంట. కథపై పూర్తి నమ్మకంతోనే ఈ సినిమా నిర్మాణ బాధ్యతని తానే స్వయంగా స్వీకరించాడు నాగార్జున. తొలి సినిమా భారీగా నిరాశ పరచడంతో ఈ సినిమాని రీ లాంఛ్ మూవీగా టేకప్ చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాలో అఖిల్ కొత్తగా కనిపించబోతున్నాడట. నిర్మాణం విషయంలో ఏ రకంగానూ నాగార్జున రాజీ పడే ప్రశక్తి లేదంటున్నాడు. చాలా రిచ్ వేల్యూస్‌తో సినిమాని తెరకెక్కించనున్నాడు. అన్నపూర్ణ బ్యానర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరక్కెబోతోందట. .ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజింగ్స్ ఉండబోతున్నాయట. గెస్ట్ రోల్స్, ఐటెం సాంగ్స్ చాలా స్పెషల్‌గా ఉండబోతున్నాయట తొలి సినిమా నిరాశ పర్చడంతో తొందరపడి ఏదో సినిమా చేసేద్దాం అనుకోకుండా ఆలోచించి, ఆచి తూచి అడుగులేశాడు అఖిల్. ఇన్ని ముందు జాగ్రత్తలతో వస్తోన్న అఖిల్ ఈ సినిమాతో ఫ్యాన్స్‌ని ఎలా సంతృప్తి పరుస్తాడో చూడాలిక!