ప్రముఖ నగల దుకాణం సంస్థ- కళ్యాణ్ జువేలర్స్ తమ ప్రచారానికి ఒక్కో ప్రాంతానికి చెందిన ఒకోక్కోక సెలబ్రిటీ ని వాడుతుంటారు. అలా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ & కింగ్ నాగార్జున కళ్యాణ్ జువేలర్స్ కి అంబాసిడర్స్ గా చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈ మధ్య ఒక యాడ్ ప్రసారం అయింది. ఆ యాడ్ లో బ్యాంక్ ఉద్యోగులని సరైన పద్దతిలో చూపెట్టకపోవడంతో బ్యాంక్ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తక్షణమే అ వీడియో ని తొలిగించాలని డిమాండ్ చేశారు.
దీనికి స్పందించిన కళ్యాణ్ జువేలర్స్ ఆ యాడ్ ని తోలిగించేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫడరేషన్(ఏఐబీవోసీ) డిమాండ్ నెరవేరింది అని చెప్పొచ్చు. ఇక ఈ యాడ్ ని అంతర్జాలం నుండి తెసేసింది.
ఇక ఈ హిందీ వెర్షన్ యాడ్ లో అమితాబ్ తో పాటు ఆయన కూతురు కలిసి మొదటి సారి నటించిన యాడ్ ఇలా బ్యాన్ అవ్వడం శోచనీయం.