సాక్ష్యం చిత్రానికి సెన్సార్ కష్టాలు

By iQlikMovies - July 23, 2018 - 13:39 PM IST

మరిన్ని వార్తలు

దర్శకుడు శ్రీవాస్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సాక్ష్యం చిత్రం ఈవారం విడుదలకి ముస్తాబవుతున్నది.

అయితే ప్రతి సినిమాకి ముందు జరిగే సెన్సార్ ప్రక్రియ ఈ చిత్రానికి రేపు జరగనుంది. ఇక్కడే ఆ చిత్రానికి తలనొప్పులు మొదలయ్యాయి అని సమాచారం. విషయానికి వస్తే, సాక్ష్యం చిత్రం చిత్రీకరణ సమయంలో కొన్ని జంతువులతో షూటింగ్ జరపగా దానికి సంబంధించి యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుండి అనుమతి తీసుకోలేదట.

వీటికి సంబందించిన అనుమతులు కోసం ఢిల్లీలోని ఆ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఆ అనుమతులు వచ్చేవరకు కాస్త సమయం పట్టేలా ఉంది అని తెలుస్తుంది. అయితే సెన్సార్ మాత్రం రేపు హైదరాబాద్ లో జరుగుతుంది, కాని ఆ అనుమతి పత్రం వచ్చేవరకు ఈ సినిమా విడుదలకి లైన్ క్లియర్ అవ్వదు.

మరి ఈ అనుమతి పత్రాన్ని ఈ శుక్రవారం లోపు గనుక పొందగలిగితే సాక్ష్యం విడుదలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఈ శుక్రవారం సాక్ష్యం విడుదలకి అడ్డంకి రావొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS