వీకెండ్ వచ్చేసింది. బిగ్‌బాస్‌లో హోస్ట్ నాగార్జున టైమొచ్చింది. అయితే, నాగార్జున ఎవరికో గట్టిగా క్లాస్ పీకాలనుకుంటున్నారు. ఎంట్రీ ఇస్తూనే చాలా కోపంగా ఉన్నారు. డాన్స్ చేస్తున్న డాన్స్ గాళ్స్‌ని స్టాప్.. ఇవాళ నో సాంగ్స్, నో డాన్స్.. అంటూ ఆపేశారు. ఇక్కడిదాకా వుంది (పీకల దాకా) అంటూ సైన్ చేసి చూపించారు. బిగ్ హౌస్‌లో చాలా జరుగుతోంది. ఇప్పుడు వారికి గట్టిగా క్లాసులు పీకాలి.. అంటూ చాలా కోపం ప్రదర్శించారు.
అసలింతకీ నాగ్‌కి అంత కోపం ఎందుకొచ్చింది.? ఈ వారం ఏ ఇష్యూస్ నాగ్‌ని అంతగా కోప్పడేలా చేశాయి.? అంటే ఒక్కసారి రివైండ్ చేసుకోవాలి. ఈ వారం చాలానే ఇష్యూస్ జరిగాయి హౌస్‌లో. దెయ్యాల టాస్క్‌కి సంబంధించి పునర్నవి చాలా ఓవరాక్షన్ చేసింది. బిగ్‌బాస్‌నే బుల్ షిట్ అని తిట్టేసింది. ముష్టి టాస్క్ అని అభివర్ణించింది. అంతేకాదు బిగ్‌బాస్‌ని నానా దుర్భాషలు ఆడేసింది.
బిగ్‌బాస్ ఇచ్చిన పనిష్‌మెంట్ టాస్క్‌ని కూడా కాదంది. మహేష్ కూడా ఈ టాస్క్ విషయంలో కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇక వరుణ్ - శ్రీముఖి మధ్య గొడవ.. శ్రీముఖి ఏడవడం.. ఇలాంటి ఇష్యూస్ చోటు చేసుకున్నాయి. అమ్మాయిల్ని ఏడిపిస్తే అస్సలు నచ్చదు నాగార్జునకి. సో వరుణ్‌కి, పునర్నవికి, మహేష్‌కి ఈ సారి గట్టిగానే షాక్ తగిలేలా ఉంది హోస్ట్ నాగార్జున ద్వారా. నాగార్జునపై తాజాగా కట్ చేసిన ప్రోమో ఈ విషయాల్ని గెస్ చేసేలా చేసింది. ఈ ప్రోమోతో ఈ వారం వీకెండ్ బిగ్‌బాస్‌పై ఆసక్తి రేకెత్తేలా చేశారు. చూడాలి మరి, నాగార్జున కోపాన్ని హౌస్‌మేట్స్ ఎలా తట్టుకుంటారో.