నాగ్ సినిమాకు అన్నదమ్ముల దర్శకత్వం!

By Inkmantra - June 29, 2020 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

అక్కినేని నాగార్జున పోయినేడాది 'నాన్ రుద్రన్' ఒక తమిళ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా కొన్ని రోజులు షూటింగ్ జరుపుకుంది కానీ మధ్యలో ఆగిపోయింది. నిర్మాణ సంస్థకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడం కారణంగా ఆ సినిమా ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

తాజాగా ఆ సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఆరు వందల ఏళ్ళ క్రితం జరిగే కథాంశంతో తెరకెక్కనున్న ఆ సినిమాకు బడ్జెట్ ఎక్కువే అవుతుందట. అయితే ధనుష్ కొన్ని మార్పుచేర్పులు చేసి బడ్జెట్ తగ్గించడంతో నిర్మాణ సంస్థ సినిమాను తిరిగి ప్రారంభించేందుకు సరే అన్నారట. ఈ సినిమాలో మరో కీలకమైన మార్పు కూడా చోటు చేసుకుంటోందట. ఈ సినిమాలో హీరోగానే కొనసాగాలని, దర్శకత్వ బాధ్యతలను అన్నయ్య సెల్వరాఘవన్ కు అప్పగించాలని ధనుష్ భావించి టీమ్ తో చెప్పడంతో ఈ సినిమాకు దర్శకుడు మారిపోయాడు.

 

తమిళంతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సెల్వరాఘవన్ తెలుగులో కూడా 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారట. మొదట్లో నాగ్ పాత్రకు రజనీకాంత్ ను అనుకున్నాడట. అయితే రజనీ ఆ పాత్ర పట్ల ఆసక్తి చూపకపోవడంతో నాగ్ దగ్గరకు వచ్చిందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS