ఇటీవల బాలీవుడ్ లో `బ్రహ్మాస్త్ర` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీసు దగ్గర రూ.300 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఉంది. ఇందులో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మైలేజీని నాగ్ వాడుకోవాలని చూస్తున్నాడు. నాగార్జున నటించిన `ది ఘోస్ట్` అక్టోబరు 5న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందన్నది నాగ్ ఆలోచన. ఎందుకంటే ఇదో యాక్షన్ డ్రామా. ఇలాంటి కథలు ఎక్కడైనా రాణిస్తాయి. అందుకే నాగ్... ఈ స్టెప్ వేయడానికి రెడీ అయ్యారు.
అయితే ఇక్కడో చిన్న చిక్కు ఉంది. ఈ సినిమాకి సంబంధించిన హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఎప్పుడో అమ్ముడుపోయాయి. హిందీలో ఈసినిమా రిలీజ్ చేయడం లేదన్న కండీషన్‌పైనే ఈసినిమాని బయ్యర్లు కొన్నారు. ఇప్పుడు ఆ బయ్యర్లతో మాట్లాడి వ్యవహారం సెటిల్ చేయాలి. అదంత తేలికైన విషయం కాదు. `బ్రహ్మాస్త్ర` మల్టీస్టారర్ సినిమా. అందులో నాగార్జున ఓ పాత్ర మాత్రమే పోషించారు. ఆయన హీరోగా నటించిన సినిమా అంటే... బాలీవుడ్ ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుందా, లేదా? అనేది కూడా చూసుకోవాలి. ఆ ఎగ్రిమెంట్లు కూడా ఒకట్రెండు రోజుల్లో జరిగిపోవాలి. అదంత ఈజీ కాదు.
అక్టోబరు 5న తెలుగులో ఘోస్ట్ వస్తోంది. ఆలోగా... హిందీ ప్రింటు రెడీ చేయడం కష్టమే.