టీజర్‌ వచ్చింది: హమ్మయ్యా సస్పెన్స్‌ వీడింది.!

మరిన్ని వార్తలు

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కి హోస్ట్‌ ఈయనే అని కన్‌ఫామ్‌ అయిపోయింది. మొన్న మొహం దాచేసి, ప్రీ టీజర్‌ వదిలిన బిగ్‌బాస్‌ టీమ్‌, తాజాగా నాగార్జునను బిగ్‌బాస్‌ హోస్ట్‌గా పరిచయం చేస్తూ అసలు సిసలు టీజర్‌ వదిలింది. ఎంతైనా స్టార్‌ హీరో స్టార్‌ హీరోనే. అప్పుడే బిగ్‌బాస్‌కి గ్లామర్‌ వచ్చేసింది. నాగార్జునపై కట్‌ చేసిన ఈ టీజర్‌ ప్రోమో అదిరిందంతే.

 

ఓ మార్కెట్‌లోకి ఎంటర్‌ అవుతున్న నాగ్‌..షాపులో ఉన్న గుడ్లు, కూరగాయలు, బియ్యం ఉన్నవన్నీ ఇచ్చేయ్‌.. ఒక్కో దానికి ఒక్కో కారణం వయ్యారంగా చెబుతున్న విధానం ఆకట్టుకుంటోంది. 100 రోజులు, 14 మంది కంటెస్టెంట్లు అని నాగ్‌ తన నోటితో స్వయంగా కన్‌ఫామ్‌ చేసేశారు. ఇంకేముంది. బిగ్‌బాస్‌పై ఇంతవరకూ ఉన్న కొన్ని ఊహాగానాలకు తెర పడినట్లే.

 

జూలై నుండే బిగ్‌బాస్‌ సీజన్‌ మొదలు కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ కూడా కొద్ది రోజుల్లోనే వచ్చేయనుంది. చేతిలో ఓ కోతి బొమ్మతో నాగ్‌ అలా స్టైలిస్తుంటే, ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ యమా స్టైలిష్‌గా ఉండబోతోందనిపిస్తోంది. ఇక ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంటర్‌టైన్‌ చేయబోయే ఆ కంటెస్టెంట్స్‌ వివరాలే తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS