ఫ్యూచర్‌లో నువ్వేమవుతావ్.. అని చిన్న పిల్లాడిని అడిగితే, ఆ వయసులో తనకున్న స్టాండర్డ్‌కి డాక్టరో, పోలీసో, లాయరో.. ఎక్స్‌ట్రా ఏదో ఒకటి అవుతానని ఠకీమని చెప్తాడు. అదే, నటీ నటుల్ని అడిగితే, చాలా మంది నుండి వచ్చే ఆన్సర్. డాక్టర్ కాబోయి, యాక్టర్ అయ్యాననే. కానీ, మన మలర్ బ్యూటీ సాయి పల్లవి అయితే, అటు డాక్టరూ అయ్యింది. ఇటు యాక్టరూ అయ్యింది. ఈమె నిజంగానే అనుకోకుండా యాక్టర్ అయ్యింది కానీ, అనుకుని డాక్టర్ పట్టా సాధించింది. మెరిట్ స్టూడెంటాయె.
కష్టపడి డాక్టర్ పట్టా పొందింది. ఎంతైనా డాక్టర్ వృత్తిని అంత సులువుగా వదులుకుంటారా.? చెప్పండి. అందుకే మన సాయి పల్లవి కూడా ససేమిరా వదులుకోనని చెబుతోంది. ఇక, యాక్టింగ్ విషయానికొస్తే, సాయిపల్లవి రూటే సెపరేటు. ఆమె స్క్రీన్‌పై కనిపించిందంటే, ఆ పక్కన ఎంత గొప్ప నటీ నటులైనా బేలగా అయిపోవాల్సిందే. అదీ సాయిపల్లవి యాక్టింగ్ టాలెంట్. యాక్టింగ్, డాన్సులూ.. ఇలా అన్నింట్లోనూ మంచి మార్కులేయించుకుంటోంది సాయి పల్లవి. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, కెరీర్‌ని చక్కగా బిల్డప్ చేసుకుంటోంది. అయితే, ఎప్పటికీ ఇది మాత్రమే తన కెరీర్ కాదంటోంది. యాక్టింగ్ అనేది టైం పాస్ మాత్రమే అని సాయి పల్లవి చెబుతోంది. ఇంట్రెస్ట్ ఉన్నన్నాళ్లూ, మంచి అవకాశాలు వచ్చినన్నాళ్లూ యాక్టర్‌గా కొనసాగి, తర్వాత డాక్టర్‌గా సెటిలైపోతానంటోంది.
కానీ, యాక్టింగ్ చేస్తూ, ట్రీట్‌మెంట్ మాత్రం చేయనంటోంది. పూర్తిగా యాక్టింగ్ నుండి తప్పుకున్నాకే డాక్టర్‌గా తన వృత్తి పట్ల బాధ్యత తీసుకుంటానని చెబుతోంది. సాయిపల్లవి కమిట్మెంట్ మనకి తెలిసిందే కదండీ. అంతే. ఆమె ఏం చేసినా అలాగే ఉంటుంది. పక్కా ప్రొఫిషనల్. అండ్ కమిటెడ్ పర్సన్. అందుకే వన్ అండ్ ఓన్లీ భానుమతి, హైబ్రీడ్ పిల్ల. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రానాతో 'విరాటపర్వం' సినిమాలోనూ, చైతూతో శేఖర్ మ్ముల మూవీలోనూ నటిస్తోంది.