కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి ఇష్యూ అనేక మలుపులు తిరిగి పక్కదారి పట్టి, చివరికి ఏ సంబంధం లేని పవన్ కళ్యాణ్‌ని ఇష్యూలోకి లాగడం దాకా చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే, ఈ మొత్తం డ్రామాలో అసలు సూత్రధారిని తానే అంటూ రామ్‌గోపాల్‌వర్మ ఓ వీడియో ద్వారా తప్పు ఒప్పుకొని బయటికి రావడంతో వివాదం ముదిరి పాకాన పడింది.
ఈ నేపథ్యలంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్‌గా రంగంలోకి దిగడంతో ఇష్యూ సీరియస్ అయిపోయింది. ఈ క్రమంలో పవన్ ఫిలిం చాంబర్‌లో ఈ ఇష్యూకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులతో భేటీ కావడంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలతో సహా, మెగా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి చాలా మంది పవన్‌కి సపోర్ట్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో అగ్ర హీరోల్లో ఒకరు, స్వయానా చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, మిత్రుడు అయిన నాగార్జునకిది గడ్డు సమస్యగా మారింది.
మదిలో పవన్‌కి సపోర్ట్ చేయాలనే యోచన ఉన్నప్పటికీ నాగార్జున అది బయటపెట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే, చాలా కాలం తర్వాత రామ్‌గోపాల్‌వర్మతో నాగార్జున 'ఆఫీసర్' సినిమా చేశాడు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఇటు పవన్‌కి సపోర్ట్ చేయాలా? లేక వర్మకి సపోర్ట్ చేయాలో తోచని స్థితిలో నాగ్ ఉన్నాడట.
ఏది ఏమైనా డైరెక్ట్‌గా పవన్‌కి తన సంఘీభావం తెలపకపోయినా, నాగార్జున వెనకుండి, తన నిర్మాణ కార్యకలాపాలను చక్కపెట్టే నాగార్జున మేనకోడలు సుప్రియ ద్వారా తన సంఘీభావం తెలిపినట్టు తెలుస్తోంది. ఫిలిం చాంబర్‌లో పవన్ చేసిన నిరసనకు పలువురు సినీ ప్రముఖులతో సహా నాగ్ మేనకోడలు సుప్రియ కూడా హాజరైనట్లు సమాచారమ్