బాలయ్య రిక్వెస్ట్ ని నాగార్జున ఒప్పుకుంటాడా?

By iQlikMovies - June 26, 2018 - 18:21 PM IST

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు-హిందీ బాషలలో ఎన్టీఆర్ సినిమా రూపొందనుంది.

ఇక ఈ చిత్రంలో ఉండే ప్రముఖుల పాత్రాలకి ఇప్పుడు ఉన్న ప్రముఖ నటులనే తీసుకునే యోచనలో దర్శక-నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే మోహన్ బాబు, మహేష్ బాబు పేర్లు వినిపిస్తుండగా తాజాగా నాగార్జున కాని ఆయన తనయుడు నాగ చైతన్య పేరు తెరపైకి వచ్చింది.

ఇంతకి వారిద్దరిలో ఒకరిని అక్కినేని నాగేశ్వర రావు పాత్రకి తీసుకోనున్నట్టుగా సమాచారం. కాకపోతే గత కొంత కాలంగా నాగార్జున-బాలకృష్ణ మధ్య సఖ్యత లేదని అందుకే ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి సైతం అక్కినేని వారికి ఆహ్వానం అందలేదని ఫిలిం నగర్ టాక్.

ఈ నేపధ్యంలో నాగార్జున కన్నా నాగ చైతన్యని ఈ పాత్ర కోసం అడుగుతున్నారట. అయితే ఇంతలోపు ఈ ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గితే  అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రలో ఆయన కుమారుడు నాగార్జున నే కనిపించే అవకాశాలు లేకపోలేదు. 

చూద్దాం... కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS