ఎన్టీఆర్ బయోపిక్ కోసం మోహన్ బాబు

By iQlikMovies - June 26, 2018 - 12:58 PM IST

మరిన్ని వార్తలు

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో బయోపిక్స్ హవా నడుస్తున్నది. ఇప్పటికే మహానటి సావిత్రి జీవితం పైన మహానటి అనే చిత్రం రావడం అది ఘన విజయం సాధించడం జరిగిపోయాయి. ఇదే వరుసలో ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పైన తీస్తున్న యాత్ర వంటివి షూటింగ్ దశలో ఉన్నాయి. 

ఇక ఎన్టీఆర్ బయోపిక్ విషయానికి వస్తే, ముందుగా అనుకున్న దర్శకుడు తేజ పక్కకి తప్పుకోగా ఇప్పుడు క్రిష్ దీనికి దర్శకత్వ భాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక ఈ సినిమాలో పాత్రల ఎంపిక గురించిన కసరత్తు నడుస్తున్నది. అందులో భాగంగానే ఒక ముఖ్య పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ని సంప్రదిస్తున్నారట. 

అయితే ఆ పాత్ర ఏంటి? ఆ పాత్ర నిడివి ఎంత? అనే ప్రశ్నలకి సమాధానాలు తెలియరాలేదు. మోహన్ బాబు కూడా తన సమ్మతిని ఇంకా తెలియచేయాల్సి ఉందట. ఒకవేళ అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఎన్టీఆర్ బయోపిక్ లో మోహన్ బాబు చేయడం ఒక సంచలనం అని చెప్పొచ్చు.

వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే బాలకృష్ణ తెలిపారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS