ఎట్టకేలకు అఖిల్ రెండో సినిమా మొదలైంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆదివారం సాయింత్రం క్లాప్ కొట్టారు. అయితే ఇందులో ఓ విశేషమేంటంటే.. నాగార్జున 'మనం ఎంటర్ ప్రైజెస్' అనే ఓ కొత్త బ్యానర్‌ని స్థాపించారు. 'మనం' అక్కినేని ఫ్యామిలీ, తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తించుకొనే మంచి సినిమా. దాన్ని సదా గుర్తుండిపోయేలా 'మనం' బ్యానర్‌కి శ్రీకారం చుట్టారు నాగ్. అంతా బాగానే ఉంది. అయితే.. ఈసినిమాని 'అన్న పూర్ణ స్టూడియోస్' కూడా నిర్మిస్తోంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మాతలన్నమాట. ఈ రెండూ నాగ్ వే. అలాంటప్పుడు రెండు బ్యానర్లు ఒకే సినిమాకి వాడుకోవడం ఎందుకో అర్థం కావడం లేదు. ఒకవేళ 'మనం' సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లే దీనికీ పనిచేస్తున్నారు కదా అని 'మనం' బ్యానర్‌ని తీసుకొచ్చారనుకొందాం. అలాంటప్పుడు ఆ ఒక్క బ్యానర్ పేరుతోనే సినిమా తీయొచ్చు కదా? 'మనం ఎంటర్ ప్రైజెస్'లో 'మనం' టెక్నీషియన్స్‌ని షేర్ హోల్డర్స్‌గా పెట్టారా?? ఏమో మరి ఈ లాజిక్కులు, లెక్కలూ.... నాగ్‌కే తెలియాలి.