సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రి పై ఊహాగానాలు ఎప్పట్టినుండో వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే ఈ రోజు తన అభిమానులను కలుస్తుండడం వెనుక ఏదైనా రాజకీయ కారణం ఉందా అనే కోణంలో చాలాపుఖార్లు షికారు చేశాయి. కాని ఇది ఒక సాధారణ మీట్ అని చాలా కాలం నుండి తన అభిమానులని వ్యక్తిగతంగా కలవలేదు గనుకనే ఈ స్పెషల్ మీట్ ఏర్పాటు చేసినట్టు రజినీకాంత్ సన్నిహిత వర్గాలు తెలియచేశాయి.
రజినీకాంత్ కూడా ఈ మధ్యనే తను రాజకీయాల్లోకి రానని చేపినప్పటికి తమిళ రాజకీయాల్లో ఉన్న శూన్యత దృష్ట్యా రజిని పొలిటికల్ ఎంట్రి ఉండబోతుంది అనేది తమిళ వర్గాల టాక్.